Take a fresh look at your lifestyle.

తుంగతుర్తి మండలంలో ఘనంగా మేడే ఉత్సవాలు

  • వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ.

ముద్ర,తుంగతుర్తి: ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంతోపాటు మండలంలోని వివిధ గ్రామాలలో వివిధ శాఖల కార్మిక సంఘాలు మేడే జెండా ఎగరవేశాయి.ఆయా గ్రామాలలో ఎర్రజెండాలతో ర్యాలీలు నిర్వహించారు.మేడే వర్థిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, అంటూ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ కార్మికులు కదం తొక్కారు.హమాలీ, తాపీ మేస్త్రి ,ఆటో డ్రైవర్స్ ,ట్రాక్టర్ డ్రైవర్ యూనియన్లతోపాటు పలు శాఖల యూనియన్లు తమ తమ మేడే జెండా దిమ్మెల వద్ద జెండాల ఎగరవేశారు.మేడే జెండాలతో ఎక్కడ చూసినా ఎరుపు మయంగా మారింది.ఈ సందర్భంగా పలు సంఘాల వారికి వివిధ పార్టీల నాయకులు సైతం సంఘీభావం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.