- స్వాగతం పలికిన బార్ అసోసియేషన్.
ముద్ర,తుంగతుర్తి: తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా మహమ్మద్ చాంద్ పాషా బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు.ఈయన గతంలో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కం స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సికింద్రాబాద్లో పనిచేసి బదిలీపై తుంగతుర్తి కి వచ్చారు.ఇక్కడ గతంలో పనిచేసిన జడ్జి సూర్యాపేటకు బదిలీపై వెళ్లారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తన శక్తి మేర కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయడంతో పాటు చట్టబద్ధమైన పాలన చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు చేపట్టిన జడ్జి మొహమ్మద్ గౌస్ భాషా కు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్, వైస్ ప్రెసిడెంట్ కారింగుల వెంకటేశ్వర్లు. ప్రధాన కార్యదర్శి పర్వీన్. జాయింట్ సెక్రెటరీ మల్లపాక రవికుమార్. ట్రెజరర్ సతీష్. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. ప్రతాప్ సీనియర్ న్యాయవాది కుమారస్వామి హరిచరణ్ చంద్రబోలి అనిల్ తదితరులు పాల్గొన్నారు