Take a fresh look at your lifestyle.

వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ధర్మపురి, ముద్ర : ప్రభుత్వం చేపట్టిన వేసవి శిక్షణ శిబిరాలను 6 నుండి 9 వ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంఇఓ వెంకటేశ్వర్లు కోరారు. బుగ్గారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం వేసవి శిక్షణ శిబిరాన్ని ఎంఇఓ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు నోటు బుక్కులు, పెన్నులు పంపిణి చేశారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరం 15 రోజులపాటు నిర్వహించనున్నమని, వివిధ అంశాలపై ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ పురుషోత్తం, ఎంఐఎస్ రాజేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.