ముద్ర ,తాండూరు:
గత కొంతకాలంగా ఉత్కంఠ రేపిన వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది.

తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా అబ్దుల్ రజాక్ లు సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వీరిద్దరి ఏకగ్రీవ ఎన్నికను అధికారులు ప్రకటించారు. మొత్తం కౌన్సిలర్లలో 19 మంది సభ్యులు(కాంగ్రెస్) హాజరుకావడంతో ఎన్నిక నిర్వహణకు అవసరమైన కోరం లభించింది. దీంతో అధికారులు ఎన్నిక ప్రక్రియను వేగవంతం చేశారు. చైర్‌పర్సన్ పదవికి పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి పేరును, వైస్ చైర్మన్ పదవికి అబ్దుల్ రజాక్ పేరును సభ్యులు ప్రతిపాదించగా.. ఇతర పోటీదారులు ఎవరూ లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారికంగా వెల్లడించారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లతో అధికారులు పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. పట్లోళ్ల నీరజ 12 వ వార్డ్ సభ్యురాలుగా, అబ్దుల్ రజాక్ 29వ వార్డు సభ్యులుగా ఎన్నికైన విషయం విధితమే. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లకు ఎన్నికల ప్రత్యేక అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్ ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువపత్రాలను అందజేశారు. చైర్ పర్సన్ గా నీరజను కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ ప్రతిపాదించగా, 22వ వార్డ్ కౌన్సిలర్ మనపురం రామకృష్ణ బలపరిచారు. వైస్ ఛైర్పసన్ గా అబ్దుల్ రజాక్ ను వేణు గోపాల్ ప్రతిపాదించగ జుంటిపల్లి వెంకటేష్ బలపరిచారు.
చైర్ పర్సన్ గా నీరజను కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ ప్రతిపాదించగా, 22వ వార్డ్ కౌన్సిలర్ మనపురం రామకృష్ణ బలపరిచారు. వైస్ ఛైర్పసన్ గా అబ్దుల్ రజాక్ ను వేణు గోపాల్ ప్రతిపాదించగ జుంటిపల్లి వెంకటేష్ బలపరిచారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కౌన్సిలర్లు, అధికారుల సమన్వయంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన నాయకులకు, కౌన్సిలర్లకు చైర్ పర్సన్ నీరజాబాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎక్స్ అఫీషియొ మెంబర్, ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.