*గణిత శాస్త్రంతో అద్భుతాలు సృష్టించవచ్చని మరియు సమాజంలో అగ్రగామిగా ఉండవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు ప్రతిష్టాత్మక చింతన మ్యాథ్స్ ఒలంపియాడ్ జాతీయ స్థాయి పోటీలలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు గణిత శాస్త్రంలో పట్టు సాధించే విధంగా ప్రోత్సాహం అందించాలని మరియు గణిత శాస్త్రంలో వివిధ రకాల పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతిభను వెలికితీయాలని వారు చెప్పారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు వివిధ రకాలు ఒలంపియాడ్ నిర్వహిస్తామని మరియు అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులను వివిధ స్థాయిలలో నిర్వహింపబడినటువంటి వివిధ రకాల పోటీలకు ఎంపిక చేసి అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని వారు చెప్పారు.
ఇటీవల కాలంలో ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ అయినా చింతన ఒలంపియాడ్ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి మాథ్స్ ఒలంపియాడ్ పరీక్షలో పాఠశాల చెందినటువంటి
అత్యుత్తమ ప్రదర్శన మ విద్యార్థులకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
🔅డి.సాత్విక్, 7వ తరగతి జాతీయ స్థాయి మొదటి ర్యాంకు,
🔅ఏ.రీతిక, 6వతరగతి & జి. సహాంస్, రాష్ట్రస్థాయి ప్రధమ ర్యాంకు
🔅 కే .అతిథి కిషన్, 4వ తరగతి, ఏ.సాయి చందన, 5వ తరగతి , ఏం.శ్రేయాన్ కార్తీక్ 9వ తరగతి – జిల్లా స్థాయి ప్రధమ ర్యాంకు,
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు పుష్పగుచ్చాలను అందజేసి భవిష్యత్తులోనూ మరిన్ని అద్భుత విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు