ముద్ర మహబూబాబాద్, ప్రతినిధి:డోర్నకల్ నియోజక వర్గం లో శనివారం అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రాంచందర్ నాయక్ మహిళా కూలీలతో కలిసి పొలంలో వరి నాట్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.మరిపెడ మండలం ఉల్లెపల్లి గ్రామ సమీపంలో వరినాట్లు వేస్తున్న మహిళలను చూసి తన కాన్వాయ్ ని ఆపారు. నాటు వేస్తున్న మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అంతలోనే తన పాయింట్ పైకి మలుచుకొని. బురద పొలంలోకి దిగి పాటలు పాడుతున్న మహిళలతో కలిసి చక..చకా నాటు వేశారు.ఈ సందర్భంగా మహిళా రైతులతో మాట్లాడుతూ నాకు ఊహతేలిసిననాటి నుండి ఇంటర్ చదువుతున్న సమయంలో ఉదయం గ్రామం లోని రైతులతో కలిసి వ్యవసాయ పనులతో పాటు అరక కట్టి నాగలి దున్నిన విషయాన్ని మహిళలతో ముచ్చటించి గుర్తుచేసుకున్నారు.దేశానికి అన్నం పెట్టే రైతన్న బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు.రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రాష్ట్రం లోని రైతులందరికీ బ్యాంకు రుణాలు మాఫీ చేసిందని చెప్పారు.చిన్న సన్నకారు రైతులకు పంటరునాలు అందజేసి నూతన వ్యవసాయం విధానాల ద్వారా రైతును రాజుగా నిలబెట్టే అందుకు కృషిచేస్తుందని చెప్పారు.
