Take a fresh look at your lifestyle.

పాఠశాలలు ప్రారంభం రోజే విద్యా కిట్ లు అందజేయాలి పిఆర్సీని వెంటనే ప్రకటించాలి టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదగిరి డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
పాఠశాల ప్రారంభమయ్యేలోపే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, యూనిఫాంలు అందించాలని
టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదగిరి
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టిపిటిఎఫ్ మెదక్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలపైన చర్చించారు. యాదగిరి మాట్లాడుతూ చాలా పాఠశాలల్లో జిల్లాల్లో మౌలిక సదుపాయాల లేమి ఉందని, వాటిని పాఠశాల ప్రారంభం లోపల పూర్తి చేయాలన్నారు. జనాభా గణన నేపథ్యంలో బడిబాట కార్యక్రమం, విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి మొదలు పెట్టాలని కోరారు. గత నాలుగు ఐదు నెలల నుండి రామాయంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ప్రధానోపాధ్యాయురాలు నాగమణి తన విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను మనోవేదనకు గురిచేస్తూ పాఠశాలలో విద్యాభ్యాసన ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. ఈ విషయంపై గతంలో రెండు సార్లు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాం రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వం జెఎసికి ఇచ్చిన హామీ మేరకు పిఆర్సి రిపోర్ట్ ను తెప్పించుకుని మంజూరి చేయాలని, పెండింగ్లో ఉన్న కరువు బత్యాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన హెల్త్ కార్డులు మంజూరు అయ్యే వరకు పాత హెల్త్ కార్డులు పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ సంగయ్య, హీరా లాల్, నజీరోడ్డిన్, అల్వాల రమేష్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్, దేవి సింగ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.