ముద్ర, కుత్బుల్లాపూర్ :
బౌరంపెట్ కు చెందిన యువకుడు, పర్వతాధిరోహకుడు పల్పునూరి తులసీ రెడ్డి ని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అభినందించారు.శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఈ సంవత్సరం ఏప్రిల్ లో చేపట్టనున్న ఎవరెస్ట్ శిఖర అధిరోహణ వివరాలు తెలియజేయగా ఎమ్మెల్యే వివేకానంద అతన్ని అభినందించి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. అత్యున్నత శిక్షణ పొందుతూ పర్వతాధిరోహణలో ఎన్నో విజయాలు సాధించిన తులసి రెడ్డి రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి కుత్బుల్లాపూర్ కు మరింత పేరు తేవాలన్నారు. పర్వతాధిరోహణలో మంచి పేరు గడుస్తున్న తులసి రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో దుండిగల్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.