Take a fresh look at your lifestyle.

మల్లన్న గదుల నిర్మాణానికి ఆర్థిక సహాయం

ముద్ర, కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వంద గదుల నిర్మాణానికి హైదరాబాద్ లోని కాచిగూడ చెప్పల్ బజారుకు చెందిన అందేలా స్వప్న నవీన్ యాదవ్ దంపతులు నిర్మాణంలో భాగంగా 15 లక్షల రూపాయలు చెక్కు రూపంలో ఆలయ ఏఈఓ కి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమరవెల్లి మల్లన్న మా ఇంటి ఇలా వేల్పు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త లింగంపల్లి శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్, అర్చకులు భాస్కర్, హైదరాబాద్ యాదవ సంఘం నాయకుడు బండారి దుర్గరాజు యాదవ్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, రూమ్స్ ఇన్చార్జి వెంకట సారి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.