- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన అమెరికా కాంగ్రెస్ సభ్యులు సేనేటర్స్.
- ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆధ్వర్యం లో మీట్ అండ్ గ్రీట్.
ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: తెలంగాణా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే అమెరికా వంటి దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.రామగుండం ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్ ఆద్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అమెరికా కు చెందిన కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు కలిశారు.రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు,ఐటి రంగాన్ని మరింత అభివృద్ధి,వాణిజ్య సంబందాలు,విద్యా,వైద్య,మౌళిక వసతుల పై చర్చించారు.
అమెరికా తెలంగాణ లో పెట్టుబడులు పెట్టుతే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి అమెరికా కాంగ్రెస్ సభ్యులకు వివరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి,భవిష్యత్తు ప్రణాళికల పై అమెరికా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణా అభివృద్ధి కి తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని అమెరికా ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హమీ ఇచ్చారు.ఈ సమావేశంలో అమెరికా కాంగ్రెస్ సభ్యులు,సెన్ టర్లు తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.