మంథని, ముద్ర: మంథని పట్టణంలోని శ్రీ శీలేశ్వర, సిద్దేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ప్రారంభమైంది.ఈ నెల 9 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా స్వస్తి పుణ్యహవచనము,గురు వందనము, గోపూజ, గణపతి పూజ,నాంధి ముఖము, మాతృకా పూజనము కల్పస్థాపనము,పంచగవ్య మేలనము,ఋత్విక్ వరణము,ప్రధాన దేవతా కల్పస్థాపనము,శ్రీ గాయత్రి మాత జపం ప్రారంభం,కుండ సంస్కార అగ్ని ప్రతిష్ట, సంపూర్ణ ఋగ్వేద పారాయణ స్వాహాకారము అత్యంత వైభవంగా నిర్వహించారు.సాయంత్రం సుహాసినులతో స్తోత్ర పారాయణం,ప్రదోష పూజ,వేదమూర్తులు గోసాం శివప్రసాద్ శాస్త్రి ఆధ్యాత్మిక ప్రవచం నిర్వహించారు.కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి చరితార్థులు కావాలని చింతలపల్లి ఉమా శంకర్ గణాపాఠి, ఒజ్జల గణేశ్ అవధాని, ఆమ్నాయవర్ధిని మిత్రబృందం తెలిపారు.