- కల్లాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు.
- పట్టించుకోని పాలకులు, అధికారులు.
గొల్లపల్లి, ముద్ర:గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు స్థలాలు లేక రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో ప్రమాదాలు జరిగేలా ఉన్నాయని వాహనాదారులు వాపోతున్నారు. జగిత్యాల జిల్లాలోని గొల్ల పల్లి మండలంలో పలు గ్రామాల రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు సరైన కల్లాలు లేకపోవడంతో రహదారికి సంబంధించిన రోడ్లను వినియోగించుకొని ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. కానీ రాత్రి సమయంల్లో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం జరిగేలా ఉందని వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అవగాహన కల్పించకపోవడంతో వారు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోస్తున్నారని. గ్రామాల్లో ధాన్యానికి స్థలాలు గత ప్రభుత్వం ఎంపిక చేయకపోవడం, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం అదే ధోరణిని అవలంభిస్తుండటం తో రైతులు చేసేదేమీ లేక రోడ్లమీదే ధాన్యం ఆరబోస్తున్నారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరింస్తున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఉన్నతధికారులు, రైతులతో మాట్లాడి వాహనదారులకు ప్రమాదాలు జరుగకుండా రైతులకు అవగాహన కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.ఎప్పటికైనా ఉన్నతాధికారులు,పాలకులు ప్రతీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి ధాన్యం ఆరబోసుకునేందుకు కల్లాల కోసం భూమి కేటాయించాలని రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలకులను అధికారులను కోరుతున్నారు.
