ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉచిత కంటి చికిత్స మరియు ఆపరేషన్ శిబిరం నిర్వహించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ శిబిరం జరుగనుంది.
పాత కలెక్టరేట్ భవనంలోని గది నెంబర్ 102లో నిర్వహించనున్న ఈ శిబిరంలో రోగులకు పూర్తి స్థాయి కంటి పరీక్షలు చేయనున్నారు. సాధారణ పరీక్షలతో పాటు ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా క్యాటరాక్ట్ (ముత్యబిందు) ఆపరేషన్లు చేయనున్నారు.
ఈ ఆపరేషన్లు మహబూబ్ నగర్ జిల్లాలోని ఏనుగొండలో ఉన్న లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో నిర్వహించబడతాయి. రోగులను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా అక్కడికి తరలించనున్నారు.
శిబిరానికి హాజరయ్యే రోగులు ముందుగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకుని రిపోర్టులతో రావాలని అధికారులు సూచించారు. అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు పత్రాల జిరాక్స్ కాపీలు మరియు ఫోన్ నెంబర్ తీసుకురావాలని తెలిపారు.
మరిన్ని వివరాలకు 9440876556, 7386940480 నంబర్లను సంప్రదించవచ్చు.