Take a fresh look at your lifestyle.

ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు

దేశం, ప్రజల భద్రత కోసం చేస్తారు
అది పోలీసు వ్యవస్థ కనుసన్నల్లోనే జరుగుతుంది
ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తారు
మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాలకు సంబంధం ఉండదు
రేవంత్ చెప్పుచేతల్లో ‘సిట్’
కూర్చొమంటే కూర్చుకుంటది… స్లాండ్ అంటే నిలుస్తది
పాలన గాలికొదిలేసి డ్రామాలాడుతున్నడు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ నేరమేమి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. దేశం, ప్రజల భద్రత కోసం ట్యాపింగ్ చేయడం సహజమన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పోలీసు వ్యవస్థ కనుసన్నల్లోనే అది జరుగుతుందని అన్నారు. ప్రభుత్వానికి కావాల్సిన సమాచారాన్ని తీసుకొచ్చే క్రమంలో పోలీసులు ట్యాపింగ్ చేయడం సహజమన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాలకు సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గురువారం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా ట్రాష్ కేసు.. ఇందులో ఏం ఉండదని కొట్టిపారేశారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందు విచారించాల్సింది ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డినే అని అన్నారు. ఆయనను వదిలేసి మమ్మల్ని పిలిస్తే ఏం వస్తదని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రతిపక్షాల ఫోన్‌లను రేవంత్ రెడ్డి కూడా ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తాము విచారణ జరిపిస్తే వీళ్లంతా కూడా జైలుకు పోతారని అన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇద్దరూ తమ ఫోన్‌లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని అన్నారు. మరి వారి వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. హామీల అమలును తప్పించుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సిట్.. రేవంత్ రెడ్డి సిట్ అంటే కూర్చుంటది.. స్టాండ్ అంటే నిల్చుంటదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరుతో కొన్ని రోజులు డ్రామా.. ఈ కార్ రేసు కొన్నిరోజులు, గొర్రెల స్కామ్ అంటూ కొన్ని రోజులు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటూ కొన్ని రోజులు డ్రామా చేసి వదిలేస్తారని చెప్పారు. ఒడిశాలోని నైనీ బొగ్గు గని టెండర్ కు సంబంధించిన సింగరేణి కుంభకోణాన్నిబయటపెట్టినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావుకు, తనకు నోటీసులు ఇచ్చిందన్నారు. , ప్రభుత్వాన్ని అస్థిర పర్చాలనే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడటం కోసం 1952(నెహ్రూ కాలం) నుంచి నేటి వరకు నిఘా వ్యవస్థలు చేస్తాయని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.