Take a fresh look at your lifestyle.

భవిష్యత్ తరాల స్ఫూర్తి కోసం ప్రతినిత్యం డా. బిఆర్ అంబేద్కర్ ని స్మరించుకోవాలి

  • డిఐసిసిఐ జిల్లా కన్వీనర్ నల్ల శ్యామ్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: దేశానికి డా. బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్శల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటం కోసం ప్రతినిత్యం డా. బిఆర్ అంబేద్కర్ ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని డిఐసిసిఐ జిల్లా కన్వీనర్ నల్ల శ్యామ్ పేర్కొన్నారు.ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అందులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కన్వీనర్ నల్ల శ్యామ్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చిత్తారి ప్రభాకర్, అల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రిటైర్డ్ ఏం ఈ వో మద్దెల నారాయణతో పాటు పలువురు పూలమాలలు వేసి అంబేద్కర్ ని స్మరించుకున్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ జీవితంలో చేసిన త్యాగాలు, రచనలపై వివరించి ఆయన వారసత్వ గౌరవ వందనంగా ఒక్క నిమిషం మౌనం పాటించారు.వారు మాట్లాడుతూ డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్, ప్రఖ్యాత భారతీయ న్యాయవేత్త, ఆర్థికవేత్త, సామాజిక సంస్కర్త, రాజకీయవేత్త భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి అధ్యక్షత వహించడంతో పాటుదేశానికి మొట్టమొదటి న్యాయ మంత్రిగా పనిచేసిన మహానుభావుడని కొనియాడారు. దళిత విద్యార్థులకు ఆర్థికంగా సహకరించాలని భవిష్యత్ తరాలకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం మెరిట్ విద్యార్థులకు సన్మానం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నక్క విజయ్, జిల్లా నాయకులు జీకూరి శ్రీహరి, పొనగంటి రాజయ్య, నర్ర రాజేందర్, కాయితీ శ్రీనివాస్ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కంటే అంజయ్య, తోట జగన్,దాసరి లక్ష్మణ్, కడమండ కమలాకర్, బొల్లం రమేష్, కొల్లూరి సురేందర్, శేర్ల రమేష్,మ్యాదరి సంజీవ్, తక్కల్ల దేవయ్య, అశోక్, దాసరి ప్రవీణ్, అసాది హరీష్, తూం వెంకటేష్,గిద్దె శంకర్, పల్లె రమేష్, బత్తుల ప్రదీప్, బాసమళ్ళ చంద్రశేఖర్, మోదిగాం రాజేందర్, జక్కుల దేవయ్య,కమలాకర్, కుసుమ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.