Take a fresh look at your lifestyle.

కుంభమేళ నుంచి తిరిగొస్తుండగా…ఘోర రోడ్డు ప్రమాదం…నాచారంకు చెందిన ఏడుగురు మృతి

ముద్ర ప్రతినిధి,మేడ్చల్: మహా కుంభమేళ నుంచి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నాచారం కు చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.జాతీయ రహదారి ( ఎన్ హెచ్ 30) పై ప్రయాణిస్తున్న వారి మినీ బస్సును మద్య ప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లా సీహోరా ప్రాంతంలో లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది.చనిపోయిన వారిలో నాచారం ప్రాంతానికీ చెందిన శశికాంత్,నవీన్,బాల కృష్ణ, సంతోష్,మల్లారెడ్డి, ఆనంద్, రవి లు ఉన్నారు.ఈ ప్రమాదం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రమాదంపై మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్,ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.