ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన పాఠశాలల కాలేజీల బంద్ పారిశ్రామిక ప్రాంతంలో విజయవంతమైంది.ఈ సందర్భంగా విద్యార్థి సంస్థల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న ఇప్పటికి విద్యాశాఖకు మంత్రి ని కేటాయించకపోవడం దుర్మార్గం అన్నారు. విద్యాశాఖ మంత్రి లేకపోగా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో ఉన్న సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని పకడ్బందీ గా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దీని ఫలితంగా కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుండి ఆర్థిక దోపిడీ చేస్తున్నారని అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అందాల పోటీలు అటహాసంగా నిర్వహించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ విద్యావ్యవస్థను గాడిలో పెట్టడానికి మాత్రం ఎందుకు దృష్టి సారించడం లేదని వారు ప్రశ్నించారు.ఇప్పటి వరకు కూడా పూర్తిస్థాయిలో స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల కు అందజేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు.ప్రభుత్వ అధికారం లోకి వచ్చే ముందు విద్యార్థులకు 5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామని ఇప్పుడు ఆ హామీ ఎక్కడ కూడా ఊసేత్తాడం లేదని గుర్తు చేశారు.విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్స్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఇంటర్ నుండి పై చదువులు చదివే ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం మధ్యాహ్న భోజనం అందించాలి తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులోకానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రానున్న భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు కొంటూ సాగర్, ప్రీతం, సూర్య పాల్గొన్నారు.