- అన్ని కుల సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలి.
- బిజెపి నేత కాసిపేట లింగయ్య సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్,మాదిగ సంఘాల పిలుపు.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఈ నెల 25నగోదావరిఖని వస్తున్న మందకృష్ణ మాదిగకు దుర్గా నగర్ లోని ఆర్కే గార్డెన్లో ఘన సన్మాన కార్యక్రమంఏర్పాటు చేసినట్లు బిజెపి రాష్ట్రనాయకులు కాసిపేట లింగయ్య, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్,సింగరేణి మాదిగ ఎంప్లాయిస్,ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. బుధవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి నేత కాసిపేట లింగయ్య, ఎస్సీ ఎస్టీ సింగరేణి మాదిగ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు బొంకూరి మోహన్,చొప్పదండి దుర్గ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు యుగేందర్, లు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ 59 ఉప కులాల కోసం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లోని రిజర్వేషన్ ఏబిసిడి వర్గీకరణ కోసం,చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం, వృద్ధాప్య, వికలాంగులపెన్షన్ల గురించి ఎన్నో ఉద్యమ పోరాటా లు చేసి ప్రభుత్వాలను ఒప్పించి సాధించారని ఉద్యమాల కోసం ఇల్లు కుటుంబాన్ని వదిలేసి అన్ని కులాల కోసం సమన్యాయం జరిగే వరకూ పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి అని అలాంటి వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించిందని అన్నారు.పద్మశ్రీ అవార్డు పొందిన తర్వాత మొదటిసారి గోదావరి ఖని కి వస్తున్న సందర్భంగా ఈనెల 25 న ఆర్కే గార్డెన్లో పెద్ద ఎత్తున ఘన సన్మాన కార్యక్రమా న్ని అన్ని సంఘాలు, అన్ని మతాల తో అన్ని వర్గాల వారితో ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ పార్టీలకతీ తంగా పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్, బిజెపి, సింగరేణి మాదిగ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు కాజీపేట లింగయ్య, చొప్పదండి దుర్గాప్రసాద్, బొంకూరి మోహన్, యుగంధర్, మంథని సంపత్, తిప్పారపు రామ్మోహన్, అశోక్,ఆకునూరి రాజయ్య, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.