Take a fresh look at your lifestyle.

అన్యాయానికి అధికార ముద్ర వేస్తే కాంగ్రెస్ స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అన్యాయానికి ప్రతినిధిగా మారిందని, ఫిరాయింపు ఎంఎల్ఏ ల పై స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆయన ఆరోపించారు. నిర్మల్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ కడియం శ్రీహరి, దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు విషయంలో స్పీకర్ నిర్ణయం న్యాయ పీఠం నుంచి అన్యాయం చేసినట్లుందని విమర్శించారు. అన్ని ఆధారాలు ముందే కనిపిస్తున్నా స్పీకర్ కు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ అరాచకాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏ ల వ్యవహారంలో తమ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచి పోతారన్నారు.

Leave A Reply

Your email address will not be published.