ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు పాత్ర ఎంతో ప్రధానమైనదని ప్రతి గ్రామంలో కాలనీలలో కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను పూర్తిగా నియంత్రించవచ్చని కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి అన్నారు . శుక్రవారం కల్వకుర్తి మండలం యంగంపల్లి గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కుడుముల శ్రీనివాస్ రెడ్డి, లంకల ప్రశాంత్ రెడ్డి రూ ,1.50 లక్షల సహకారంతో ఏర్పాటు చేసిన 13 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,గ్రామ మాజీ సర్పంచ్ ఎదిరే సత్యం,మాజీ ఉపసర్పంచ్ రామస్వామి, కిరణ్,జహంగీర్, గుర్రాల రాజు, కిషోర్ రెడ్డి,రవి,రామోజీ,ఆలూరి చెన్నయ్య,గ్రామ పంచాయతి సిబ్బంది పాల్గొన్నారు.