Take a fresh look at your lifestyle.

హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆశీస్సులతో మంజూరు అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను మార్కెట్ కమిటీ చేర్మన్ మక్త జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తీరని కలగా మిగిలిన కోరిక మంత్రి నెరవేర్చడంతో గ్రామ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుందని చేర్మన్ విలేకరులతో అన్నారు.సుమారుగా రెండు కోట్ల యాభై లక్షలతో ఈ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.గ్రామంలో ఇంకా మౌలిక సదుపాయాల కల్పన కోసం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు త్వరలో గ్రామ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని అన్నారు.ఇదొక్కటే కాకుండా కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వెంట మాజీ సర్పంచ్ చందులత, వీరమల్లప్ప, పట్లోళ్ల రాజు పటేల్,దోడ్డోళ్ల కిష్టయ్య,గున్నాల నాగప్ప,వారాది శంకరప్ప,సిద్దారెడ్డి,గొల్ల నాగేందర్,బేగరి మని,శంకరయ్య, వరప్రసాద్,రిపోర్టర్ మన్నే నాగేష్,పెద్దగొల్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.