Take a fresh look at your lifestyle.

టి యు డబ్ల్యూ జే (ఐజేయు ) సభ్యత్వ క్యాంపెయిన్ కు విశేష స్పందన టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు

 

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్) ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ క్యాంపెయిన్ కు విశేష స్పందన లభిస్తుందని టీయూడబ్ల్యూజే ఐ జే యు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సభ్యత్వ క్యాంపెయిన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వెలుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫణీంద్ర కు సభ్యత్వం ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే టీయూడబ్ల్యూజే ఐ జేయు పట్ల రాష్ట్రవ్యాప్తంగా కూడా విశేష ఆదరణ లభిస్తుందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం త్వరలో రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ లను కలిసి వినతి పత్రం అందజేస్తామని చెప్పారు. యూనియన్ సభ్యత సేకరణ అనంతరం జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జె ఐ జే యు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయకుమార్, జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రవీందర్ శర్మ, తండు వెంకటేష్ గౌడ్, ఖలీల్ అహ్మద్, పులుసు నాగరాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.