ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
భారత మాత ముద్దుబిడ్డ, ధైర్యానికి, దేశభక్తి, దైవభక్తి ధీరత్వానికి మారుపేరు ఛత్రపతి శివాజీ శివాజీ వర్థంతి పురస్కరించుకొని సబ్బుబిళ్ళ మీద శివాజీ చిత్రం వేసి ఘన నివాళులు అర్పించారు గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీ పేరు చెప్పగానే ప్రతి హిందువు రక్తం ఉరకలేస్తుంది. వీరుడు శూరుడు హిందువుల పాలిట దేవుడు బానిస బతుకులను చేరిపేసి హిందూరాజ్యాన్ని ఏలిన ధీరుడు ఛత్రపతి శివాజీ అన్నారు.