Take a fresh look at your lifestyle.

ఆశా కార్యకర్తల సమస్యలను వెంటనే పరిష్కరించాలి -ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి -బి ఆర్ టీ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు టైగర్ కృష్ణయ్య డిమాండ్

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని బి ఆర్ టీ యు రాష్ట్ర నాయకులు టైగర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా 50 లక్షలు ఇవ్వాలని, కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అర్హులైన ఆశాలకు ఏఎన్ఎం పోస్టులు ఇవ్వాలని, ఆశా కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఆపాలని, ఇండ్లు లేని నిరుపేద ఆశలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ఆశా కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్ కనీసం ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని, రిటైర్డ్ ఆషా లకు నెలకు 10వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు జిల్లా అధ్యక్షులు టైగర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య ఆశా కార్యకర్తల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు, నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిని కలసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.\

జిల్లా కలెక్టర్ తివారి మాట్లాడుతూ తప్పకుండా నా పరిధిలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. రాష్ట్ర పరిధిలో ఉన్న సమస్యలను కమీషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి స్వర్ణ కుమారి మాట్లాడుతూ తప్పకుండా జిల్లా పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు వచ్చిన వెంటనే తప్పకుండా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డిఆర్టియు జిల్లా అధ్యక్షులు టైగర్ కృష్ణయ్య మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న రోజుల్లో ఆశా కార్యకర్తలను గుర్తించి వారి శ్రమని గౌరవించి దాదాపుగా పదివేలు జీతం వరకు పెంచి ప్రతినెల 1వ తేదీ నాడే జీతాలు వచ్చేవని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు మూడు నెలల వరకు పాత జీతాలు కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా నెలకు 18 వేల రూపాయల జీతం ఇవ్వాలని, ఆశా కార్యకర్తలకు అర్హులైన వారికి ఏఎన్ఎం, జిఎన్ఎమ్, పోస్టులు ఇవ్వాలని, ఆరోగ్య భీమా 50 లక్షల వరకు ఇవ్వాలని, ఇల్లు లేని పేద ఆశలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ఆశలకు పెన్షన్ నెలకు పదివేల ఇవ్వాలని, డిమాండ్ చేశారు. ఐదు రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలో సంపూర్ణంగా ఆశాలు సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం వైఖరి ఎలాగా కొనసాగితే సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రతి ఒకటి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వానికి కార్మిక వర్గం రాబోవు కాలంలో తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అనిత, జ్యోతి. చంద్రాకల, రంజిత, యాదమ్మ, వెంకటమ్మ, గంగ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.