. బాలింత శరీరంలో కాటన్ మరిచిపోయి కుట్లు వేసిన వైనం
. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల అగ్రహం
ముద్ర, తాండూర్ ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల మాత శిశు సంరక్షణ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చే రోగుల పట్ల వైద్యులు చెలగాటమాడుతున్నారు. తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది బషీరాబాద్ మండలం డబల్ గ్రామానికి చెందిన పార్టీ అనే గర్భిణి తన భర్తతో కలిసి మే 3న మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు. ఆ గర్భిణీకి మొదటి కాన్పు కావడం వల్ల కాన్పు సమయంలో శరీరంలో కాటన్ అలాగే పెట్టి కుట్లు వేశారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారం రోజుల తర్వాత గర్భిణి తీవ్ర అనారోగ్యానికి గురి అయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అచ్చట వైద్యులు ఆ గర్భిణికి వైద్య పరీక్షలు నిర్వహించగా కడుపులో నుండి కాటన్ బయటకు తీశారు. శరీరంలో కాటన్ అలాగే ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రతరం అయి జ్వరం రావడం వల్ల దీంతో ఆ కుటుంబ సభ్యులు మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైద్యులు తమకేమి తెలవదు అన్నట్లుగా వ్యవహరించి ఆ గర్భిణీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తీసుకెళ్లరు. ఈ ఘోర నిర్లక్ష్యానికి కారణమైన ఆసుపత్రి వైద్యురాలు, మరియు సిబ్బందిపై తక్షణమే విచారణ జరిపి
బాధ్యులైన వారందరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.