Take a fresh look at your lifestyle.

కూచన్ పల్లిలో బడిబాట

ముద్ర ప్రతినిధి, మెదక్:
పిఎంశ్రీ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి ప్రధానోపాధ్యాయులు, స్థానిక మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారి దగ్గరికు వెళ్లి గ్రామంలోని విద్యార్థులు అందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గుచూపకుండా గ్రామంలోని అందరూ కూడా మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలను పొందాలని కోరారు. సీనియర్ ఉపాధ్యాయులు శివరాజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.