ముద్ర ప్రతినిధి, మెదక్:
ధాన్యం దిగుమతులలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని
కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు.
జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి ప్రక్రియను మిషన్ మోడ్ లో వేగవంతంగా జరగాలని ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో సాఫీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతులు, ఇతర అంశాలపై అదనపు కలెక్టర్ నగేష్. అదనపు ఎస్పీ విక్రాంత్ సింగ్, ఆర్డీవోలు, సివిల్ సప్లై, కోపరేటివ్, తహసిల్దార్లు, ఎంపీడీవోలు పోలీస్, డిఆర్డిఓ అధికారులతో కలెక్టరేట్ కార్యాలయం నుండి గూగుల్ మీట్ నిర్వహించారు.
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వరి ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేసి నిబంధనల మేరకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి కేటాయించిన రైస్ మిల్లులకు, గోదాములకు తరలించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా
కేంద్రాలకు వచ్చే ధాన్యాంని బట్టి రవాణా శాఖ అధికారులు సరిపడా ట్రక్లను సమకూర్చాలన్నారు. వరి కొనుగోలు, దిగుమతి ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిషన్ మోడ్ లో మిల్లులకు తరలించాలని, ధాన్యం దిగుమతుల విషయంలో మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో తూకం, రవాణా, గన్నీ బ్యాగుల సరఫరా, హమాలీల ఏర్పాటు వంటి అంశాల్లో అలక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు.
*1.32 లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం కొనుగోలు
జిల్లాలో ఇప్పటివరకు 29,670 మంది రైతుల నుండి 1,32,992 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 14,966 రైతుల అకౌంట్లలో 171.91 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post