ముద్ర ప్రతినిధి, మెదక్:
చిలప్ చెడ్ మండలం కేంద్రంలో మండలానికి చెందిన 150 మంది గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ న్యూట్రిషన్ కిట్లను రాజన్న ఫౌండేషన్ చైర్మన్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అందజేశారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, పోషకాహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన అన్నారు. అనంతరం పలు గ్రామాల బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. రాందాస్ గూడలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్నికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు పాండరి, మాజీ వైస్ ఎంపీపీ విశ్వంభస్వామి, తార విష్ణువర్ధన్ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి,సర్పంచులు బెస్త దుర్గచలం, సుధీర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శేషాద్రి, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
Swapna is a Web Admin and She is working with our organisation and She has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.