ముద్ర, తాండూర్:
దేశంలో మతకల్లోహాలు సృష్టించేందుకు పన్నాగం పన్ని అస్సాంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ నాయకులను చంపేయండి అంటూ ముస్లింలను రెచ్చగొడుతూ మత ద్వేషాలను సృష్టించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాండూర్ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూర్ బిజెపి నాయకులు పట్టణ సిఐ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఒక్కరోజు నమాజ్ చేయకున్నా పర్వాలేదు కానీ వీళ్లను చంపేయండి అంటూ బహిరంగంగా సభాముఖంగా అనడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ హిందువులపై మతద్వేషం ఏ విధంగా ఉందో ప్రజలందరూ గమనించాలని వారు పేర్కొన్నారు. హిందూ సంస్థలను దూషించిన మల్లికార్జున కర్గేపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని తాండూర్ పట్టణ బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, పట్టణ ప్రధాన కార్యదర్శి మంతటి రాజు, ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షాబుద్దీన్, తాండూర్ పట్టణ బిజెపి కౌన్సిలర్లు నాగారం మల్లేశం, అంతారం కిరణ్, శ్రీకాంత్ రెడ్డి, నాయకులు సంగమేశ్వర్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.