ముద్ర ప్రతినిధి, నిర్మల్:
వ్యవసాయ పనుల్లో ఆధునిక యంత్రాల వాడకం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.
జిల్లాలోని సారంగాపూర్ మండలం కౌట్ల (బి) రైతు సంఘానికి రూ.3.85 లక్షల సబ్సిడీతో మంజూరైన డ్రోన్, పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ పనుల్లో ఆధునిక వ్యవసాయ పనిముట్ల వాడకం వల్ల రైతులు ఎంతో లాభం పొందుతారన్నారు. పనులు తక్కువ కాలంలో, తక్కువ శ్రమతో పూర్తవుతాయని పేర్కొన్నారు. దీని వల్ల రైతుకు సమయం, డబ్బు ఆదా అవుతాయని అన్నారు. మరింతమంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, ఇతర అధికారులు, రైతులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.