- మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.
ముద్ర ప్రతినిధి, వనపర్తి : ప్రభుత్వం అందించే నాణ్యమైన సన్న బియ్యంను రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం అమరచింత మండలం నాగర్ కడమూల్ గ్రామంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు తో కలిసిమక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఓ సన్న బియ్యం లబ్ధిదారుల కుటుంబాన్ని సందర్శించి, వారి ఇంట్లోనే ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించే నాణ్యమైన సన్న బియ్యంను రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పేదలు కూడా నాణ్యమైన ఆహారం తినాలనే ఆలోచనతోనే ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకు వచ్చిందని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం వారు గ్రామంలో ఉన్న రేషన్ షాపును అదనపు కలెక్టర్ సందర్శించి రేషన్ కార్డుదారులకు సక్రమంగా రేషన్ పంపిణీ చేయాలని సూచించారు.మండలంలోని నాగల్ కడ్మూర్ మరియు పామిరెడ్డి పల్లి గ్రామాలలోని రైతువేదికలలో మహిళా సంఘాల (ఐకేపీ) ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కల్లు గీత సంఘం ఛైర్మన్ నాగరాజు గౌడ్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.
