Take a fresh look at your lifestyle.

కాలనీ వాసుల గోడు.. సమస్యలు పరిష్కరిస్తాం: వెంకటేష్ గౌడ్

ముద్ర కూకట్‌పల్లి:

అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో త్రాగు నీరు మరియు డ్రైనేజీ లైన్స్ కు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందించారు . సానుకూలంగా స్పందించిన వెంకటేష్ గౌడ్ కాలనీ వాసులతో మాట్లాడుతూ సమస్యలను శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.