ముద్ర పెబ్బేర్
గత మూడు దశాబ్దాలుగా న్యాయస్థానంలో పెబ్బేరు సంతస్థల వివాదం సర్వేనెంబర్ 392 భూ యజమానులకు దేవాదాయ శాఖకు మధ్య కొనసాగుతున్నదని పలుమార్లు భూ యజమానులకు వరుసగా 2003 2007 2022 అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని పత్రిక సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇట్టి విషయంలో న్యాయస్థానాన్ని అతిక్రమించి రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల సమయంలో 30 ఎకరాల 19 గుంటలు మొత్తం భూమి ప్రభుత్వానిదేనని ఇందులో నేను కబ్జా చేయడానికి కుట్ర చేస్తున్నానని నీచమైన నిరధారణమైన ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. ఒక్క నెలలో సంతస్థలం మొత్తం ప్రభుత్వ పరం చేసుకుంటామని బీరాలు పలికిన నాయకులు మూడేళ్లు గడుస్తున్న నేటికీ మాట నిలబెట్టుకోకుండా పోవడమే కాకుండా నేడు భూసేకరణ పేరిట భారీ దోపిడీకి కుట్ర చేయడం సిగ్గుచేటు అని తీవ్రంగా విమర్శించారు. పెబ్బేరు ప్రజల వ్యాపారస్తుల క్షేమం కోసం భూ యజమానులతో ప్రభుత్వపరంగా సంతా స్థలం కోసం 16 ఎకరాలు ఇస్తే ప్రత్యామ్నాయంగా వ్యవసాయ భూమి ఇప్పిస్తామని ఒప్పించి యజమానులతో అంగీకార పత్రం ఇప్పించేశామని ఇంతలో ఎన్నికలు రావడం పోటీలో ఉన్న మూర్ఖులు రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక కబ్జా చేశానని దుష్ప్రచారం చేశారన్నారు. నేడు న్యాయస్థానం 30 ఎకరాల 19 గంటల భూమి యజమానులు చెందుతుందని తీర్పు ఇవ్వడంతో ఆరోజు మాట్లాడిన నాయకులు ఎక్కడని ఆయన దుయ్యబడ్డారు. భూ సేకరణ పేరిట భారీ అవినీతి కి దోపిడికి కుట్ర జరుగుతుందని అన్నారు. 30 ఎకరాల 19 గుంటలో భూమి ఎటువంటి పరిహారం ఎవరికి ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సంతకు వినియోగిస్తామని కుర్చీ వేసుకుని ఒక్క నెలలో ప్రహరీ గోడ కడతామని పలికిన అసమర్ధ నాయకులు న్యాయస్థాన తీర్పుతో కంగుతిని ప్రజల ముందు మాట్లాడలేకపోతున్నారని భూసేకరణ పేరిట భారీ దోపిడీకి తెర లేపారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. విశ్వాసనీయ సమాచారం ప్రకారం భూ యజమానులకు సంత స్థలానికి ప్రత్యామ్నాయంగా మన జిల్లా సరిహద్దులు దాటి అత్యంత విలువైన భూమిని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర లో ఇప్పిస్తామని ఇందులో ముఖ్యమంత్రి సోదరుని సహాయం తీసుకుంటున్నామని మీకు ఇచ్చే భూమిలో సగం భూమి వారికి ఇవ్వాల్సి ఉంటుందని యజమానులతో సంప్రదించడంతో వేలకోట్ల దోపిడీకి కుట్ర చేశారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ సమావేశంలో వనం రాములు యాదవ్, దిలీప్ రెడ్డి, కర్రే స్వామి, కౌన్సిలర్ సౌజన్య మన్యం, వెంకటేష్, రాజశేఖర్ ,విశ్వరూపం, ఎద్దుల సాయి, గోపి ,సహదేవుడు, శేఖర్ ,రామకృష్ణ, రాము, రాములు, భారతి ,మాధవరెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.