కోరుట్ల, ముద్ర విలేకరి: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే సబ్-జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలకు కోరుట్ల పబ్లిక్ స్కూల్ కు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. డిస్ట్రిక్ట్ లెవెల్ బ్రాడ్ జంప్ లో నేమూరి నిత్యశ్రీ, 60 మీటర్ల పరుగులో అల్లే హేమ లు ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎన్నికవడం జరిగింది.ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ గుజ్జటి వెంకటేష్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు శంకర్, వనిత, అధ్యాపక బృందం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సాహం అందించారు.