మిల్లర్ల వద్ద ధాన్యం కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి
ముద్ర, తుంగతుర్తి….
ధాన్యం కొనుగోలు సెంటర్లలో అక్రమాలను అరికట్టాలని ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా రైస్ మిల్లుల వద్ద వరి ధాన్యంలో కోదలను లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ రావులపల్లి,వెంపటి గ్రామాల లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం సేకరణలో జరుగుతున్న అక్రమాలు అరికట్టాలి అని వరి ధాన్యం దిగుమతి చేసుకుంటున్నా మిల్లుల వద్ద ధాన్యంలో తరుగు కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేర్ల నమోదు సీరియల్ ప్రకారం కాంటాలు పెట్టాలి అని అన్నారు వచ్చే నాలుగు ఐదు రోజులలో రోహిణి కార్తె వస్తుందని వానాకాలం సీజన్ ప్రారంభంఅవుతున్నందున వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలని డిమాండ్ చేసారు. రైతులు ఖరీఫ్ వరి పంట కోసం దుక్కులు దున్నే సమయం ఆసన్నమైనందున ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలోతునికి సాయిలు, సర్పంచ్ మనోజ్ ,ఎల్లయ్య,మాజీ సర్పంచ్ యాకు నాయక్, నాగయ్య,నాయకులు ప్రసాద్, సురేష్ ,భాస్కర్. వెంకన్న , బిక్షం,వీరస్వామి,నర్సయ్య,రాము..యాదయ్య. అంబేడ్కర్. పరశురాములు, సత్తయ్య,నవీన్ లింగయ్య, కాలేంచెర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.