48 గంటల్లో నిందితున్ని పట్టుకున్న పోలీసులు….
బైక్, నగదు, సెల్ ఫోన్ స్వాధీనం….
ముద్ర, కోరుట్ల;
కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో తమ్మిశెట్టి శ్రీను అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం రోజు దొంగలు పడి బీరువాలోనీ నగదు దొంగిలించారు. 48 గంటల్లోనే ఛేదించిన పోలీసులు నిందితున్ని పట్టుకుని బైక్, నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ వివరాలను వెల్లడించారు. కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన తమ్మిశెట్టి శ్రీను అనే వ్యక్తి ఈ తన కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామమైన ప్రకాశం జిల్లాలోని తన బంధువుల పెళ్ళికి వెళ్లి తిరిగి 17వ తారీకు రోజున ఇంటికి రాగా తాను ఉంటున్న ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్ళి చూడగా బీరువాలో దాచిపెట్టుకున్న 4 లక్షల రూపాయల డబ్బులు, 20 వేల రూపాయల సెల్ఫోన్ ని ఎవరో గుర్తుతెలియని దొంగలు దొంగిలించుకుని పోయారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అట్టి కేసు దర్యాప్తు స్వీకరించిన సిఐ కే. లక్ష్మీనారాయణ ఒక బృందాన్ని ఎస్సై కోరుట్ల ఏం. చిరంజీవి, ఇద్దరు కానిస్టేబుల్ తో ఏర్పాటు చేసి దాదాపు 48 గంటలు నిర్విరామంగా శ్రమించి పట్టుకున్నారు. నిందితుడు నాగర్ కర్నూల్ వ్యక్తిగా గుర్తించారు. నిoదితుడు గతంలో ఫిర్యాదు తమ్మిశెట్టి శ్రీను దగ్గర పనిచేసినటు వంటి వ్యక్తిగా గుర్తించారు. తన స్నేహితుడు వారం రోజుల క్రితం బైకు కొన్నాడని తాను కూడా ఎలాగైనా బైక్ కొనాలని ఉద్దేశించుకుని జల్సాల కోసం ఈ దొంగతనం చేసినట్లుగా గుర్తించారు. గురువారం రోజు నిందితుని పట్టుకొని దొంగిలించిన డబ్బులతో కొన్న లక్ష 65, వేల బైక్, లక్ష 80 వేల నగదు ఒక సెల్ ఫోను స్వాధీనపరచుకొని నిందితుడిని జైలు కీ పంపించడం జరిగింది. కేసులొ చాకచక్యంగా పని చేసిన పురుషోత్తం, గట్టు శ్రీను లను డీఎస్పీ రాములు నగదు రివార్డ్ తో అభినందించారు. కేసు ను చెందించడం లొ కష్టపడినా సిఐ లక్ష్మినారాయణ, ఎస్సై చిరంజీవి లను అభినందిచారు.