Take a fresh look at your lifestyle.

ఆ వాహనము అడ్డుకోవడాని అనుమతి ఇవ్వండి

హనుమకొండ,ముద్ర: గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి లోని 66 డివిజన్లలో చెత్త సేకరణ చేసి కాజిపేట్ మండలం మడికొండ గ్రామం శివారు డంపింగ్ యార్డు కు వచ్చే వాహనాలని అడ్డుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ గురువారం అఖిల పక్షం అద్వర్యం లో కార్పొరేటర్ అవాల రాధిక రెడ్డి మడికొండ పోలీస్ స్టేషన్ సి.ఐ పుల్యాల కిషన్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాటాడుతూ 66 డివిజన్ లలో కార్పొరేషన్ అధికారులు చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు వివిధ వాహనాలు ద్వారా తరలించి నిప్పు పెట్టడం వల్ల వాతావరణం కాలుష్యం అయ్యి చుట్టూ 20 కిలోమీటర్ల మెరా పొగతో కూడిన భుడిద గాలి ద్వారా గ్రామాల పై పడుతిందని దీని మూలంగా ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని ధీనితో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు.గత కొన్నినెలలుగా  కార్పొరేషన్  అధికారులకు, రాజకీయనాయకులకు డంపింగ్ యార్డు తరలించాలని గ్రామస్తులు ఫిర్యాదు చేసిన పట్టించుకొక పోవడంతో అఖిలపక్షం ఏర్పాటు చేసి పోరాటం చేస్తున్నామని చెప్పారు.రానున్న రోజుల్లో పోరాటాన్ని ఉద్రిక్తం చేసి డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి తరలించే వరకు పోరాడుతామని అన్నారు.కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్రాధికార ప్రతినిది గడ్డం మహేందర్ బి.ఆర్.ఎస్ నాయకులు జాంబవ సంఘం మాజీ అధ్యక్షులు రాసమల్ల వెంకటస్వామి, అరూరి తిరుపతి, పరవస్తు రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.