Take a fresh look at your lifestyle.

ఘనంగా శ్రీపాదరావు జయంతి

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అధికారికంగా ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ బస్టాండ్ చౌరస్తాలో గల శ్రీపాదరావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ సహా పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.