Take a fresh look at your lifestyle.

దయాకర్ గెలుపుకు మహిళా కార్యకర్తల ప్రచారం.

ముద్ర. పరకాల : పరకాల మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బాసాని దయాకర్ గెలుపు కోరుతూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృతంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాలా మేరకు స్థానికుడైన , అందరికీ సుపరిచితుడైన దయాకర్ ను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే పరకాల అభివృద్ధి సాధ్యమని, వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాడని వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు.

ఈ సందర్భంగా మహిళా నాయకురాలు మాట్లాడుతూ బాసాని దయాకర్ కు వార్డులోని అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగెం మాజీ ఎంపీపీ కందకట్ల కళావతి, 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దార్న వసుంధర, బాసాని కల్పన తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.