Take a fresh look at your lifestyle.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను రాజకీయాలకు ఆతీతంగా విజయవంతం చేయాలి..రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..

కరీంనగర్:

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను సమష్టిగా అందరం సక్సెస్ చేద్దాం..

కరీంనగర్ ఉమ్మడి జిల్లాను అగ్రభాగాన నిలుపుదాం..

ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి..

అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి ప్రధాన లక్ష్యం..

ప్రధాన సమస్యలన్నింటిని పరిష్కరించుకుందాం..

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరుపుకుందాం..

రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు..

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను  రాజకీయాలకు ఆతీతంగా విజయవంతం చేయాలి..

కరీంనగర్ జిల్లాను ఆదర్శంగా నిలుపుదాం..

 

సన్నాక సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎంపీ ,ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, సిపి ఎస్పీలు అదనపు కలెక్టర్లు

రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో 99 రోజులపాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వ యంత్రాంగము ప్రజా ప్రతినిధులు ప్రజలు, అందరం కలిసి విజయవంతం చేద్దామని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో తీసుకెళ్లి అగ్ర భాగాన నిలుపుతామని పేర్కొన్నారు. ఒకవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టిస్తున్నదని తెలిపారు. రెండున్నర సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికీ వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు ,ఎమ్మెల్యేలు పెద్దపెల్లి ఎంపీ ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లు సిపి, ఎస్పీలు అడిషనల్ కలెక్టర్లు అన్ని శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్, ఆర్ అండ్ బి కి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 99 రోజులపాటు ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామాలు పట్టణాల్లో ప్రధాన సమస్యలన పరిష్కారం.. రెండున్నర సంవత్సరాల ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో దేశంలోనే మహత్తరమైన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. దేశానికే తెలంగాణ మోడల్ అభివృద్ధిలో నిలుస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి లక్ష కోట్లు బడ్జెట్ కేటాయించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని పేర్కొన్నారు. అత్యధికంగా పంట పండించడంలోనూ అత్యధికంగా ధాన్యాన్ని సేకరించడం లో తెలంగాణ ప్రభుత్వానికి సాటి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇరిగేషన్ తోపాటు విద్యుత్ రంగంలోనూ మంచి ఫలితాలు ప్రభుత్వం సాధిస్తుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం ముందుండి 99 రోజుల పాటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు ముందుండి నడిపించాలని ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధికారులు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.సన్నాహక సమావేశంలో సభ్యులు తెలిపిన సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు సమష్టిగా సఫలీకృతంగా ఈ కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా ఉంటూ 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి చేద్దామన్నారు. తద్వారా కరీంనగర్ జిల్లాను అగ్ర భాగాన నిలుపుదామని పేర్కొన్నారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను రాజకీయాలకతీతంగా విజయవంతం చేయాలి..

మంత్రి పొన్నం ప్రభాకర్..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాజకీయాల కతీతంగా అందరూ కలిసి విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు యంత్రాంగం ముందుండి విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఈ ప్రణాళిక ను సమర్థవంతంగా నిర్వహించేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, రోడ్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇండ్లలో శిథిలావస్థలో ఉన్న టీవీలు కంప్యూటర్లు ఇతర వస్తువులను ఈ వేస్ట్ విధానం ద్వారా సేకరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక బృహత్తరమైన ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని ప్రజలందరూ పెద్ద బాధ్యతగా తీసుకొని సక్సెస్ చేయాలని పేర్కొన్నారు. ఇందులో వార్డు మెంబరు నుంచి సర్పంచులు, కౌన్సిలర్లు కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు అందరూ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. రహదారి భద్రత కింద ప్రత్యేకంగా ఇందులో భాగంగా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. సురక్షితంగా చేరుకోండి అనే నినాదంతో ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 18 వరకు హోంశాఖ రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణల లక్ష్యంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో మహత్తరమైన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సత్వరమే స్పందించి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం రహ వీర్ పేరిట తగిన ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.