ముద్ర ప్రతినిధి, నిర్మల్:
తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రతి ఏటా భాషా, సాహిత్యం, చరిత్ర రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్నావారికి అందజేస్తున్న ధర్ననిధి పురస్కారం ఈ ఏట నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన తుమ్మల దేవరావును వరించింది. తుమ్మల గత 25 సంవత్సరాలుగా చరిత్రను పరిశోధన చేస్తూ17 కన్నడ, తెలుగు, ఉర్దూ, ఫారసి శాసనాలను వెలుగులోకి తెచ్చారు. మరుగున పడిన ఎన్నో శిల్ప ప్రతిమలను వెలుగులోకి తెచ్చారు. రాంజీగొండు చరిత్రను వెలుగులోకి తెచ్చారు.వీరి కృషికి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం, భాషా సాంస్కృతిక శాఖ ఉత్తమ పరిశోదన పురస్కారం. సినారే పురస్కారం, సినారే కళాపీఠం జాతీయ పురస్కారం, రంజని కుందుర్తి, ఎక్స్ రే, కవిసంధ్య, గుఱ్ఱం జాషువా, విమల శాంతి, గిడుగు రామామూర్తి పంతులు జాతీయ అవార్డులను అందుకున్నారు.
ఈ నెల 17న తెలంగాణ సారస్వత పరిషత్తులో దేవులపల్లి రామానుజ రావు కళా మందిరంలో అవార్డు ప్రదానం చేయనున్నారు. ఎల్లూరి శివారెడ్డి, చెన్నయ్య ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో 5వేల నగదు, జ్ఞాపిక, శాలువ, ప్రశాంసాపత్రం అందజేయనున్నారు.