Take a fresh look at your lifestyle.

కూకట్‌పల్లిలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు: విగ్రహాన్ని ఆవిష్కరించిన బండి రమేష్*

ముద్ర కూకట్‌పల్లి:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్ బస్టాప్ వద్ద కాంగ్రెస్ నాయకుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:అంబేద్కర్ ఏ ఒక్క కులానికో, మతానికో లేదా ప్రాంతానికో పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావి అని కొనియాడారు.అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన విశాల దృక్పథం, రచించిన రాజ్యాంగం నేడు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.నియోజకవర్గమంతా జై భీమ్ నినాదాలతో మార్మోగింది.

Leave A Reply

Your email address will not be published.