విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న డీకే స్నిగ్దారెడ్డి
శిలాఫలకంపై ఎంపీ అరుణ పేరు చిన్న అక్షరాలతో రాయడంపై మండిపడ్డ బీజేపీ నాయకులు
విగ్రహదాతలను అగౌరవపరిచిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు
అంబేద్కర్ జయంతి రోజు కూడా రాజకీయాలు చేయడం హాస్యస్పదం…
విగ్రహ దాతలను మరిచిన అధికార పార్టీ నాయకులు…
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం కొండాపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవ మహోత్సవ వేడుకల్లో బిజెపి జిల్లా యువ నాయకురాలు డికె .స్నిగ్దా రెడ్డి ,జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు,కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు ,మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాహానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శిలాఫలకంపై విగ్రహదాత అయినటువంటి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు చిన్నగా లిఖించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని కేటిదొడ్డి పోలీసులు అడ్డుకోవడంతో నాయకులకు ,పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విగ్రహావిష్కర కార్యక్రమం కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం అత్యంత విచారకరమని, ఇది “సొమ్ము ఒకరిది – సోకు మరొకరిది” అన్న వి దంగా ఉందని విమర్శించారు.

అధికార పార్టీ నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు అని
విగ్రహ ఏర్పాటు కోసం అప్పటి గద్వాల ఎమ్మెల్యే, ప్రస్తుత మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తన వంతుగా ఆర్థిక సహాయం అందించిందని గుర్తు చేశారు. ఆంబేద్కర్ వేడుకలకు కనీసం దాతలను ఆహ్వానించకుండా, వారి పేర్లను ప్రస్తావించకుండా, శిలాఫలకంపై ఎంపీ డీకె అరుణ పేరు చిన్న అక్షరాలతో లిఖించడం, అధికార పార్టీ నాయకులు ఆ విగ్రహం తమ సొంత ఆస్తి అన్నట్లుగా వ్యవహరించడం దారుణం అని మండిపడారు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా జరుపుకోవాల్సిన అంబేద్కర్ జయంతి రోజున రాజకీయాలు చేస్తు పబ్బం గడుపుకోవడం ఆయన ఆశయాలను అవమానించడమే అని ఆరోపించారు. విగ్రహ ఏర్పాటుకు చిల్లిగవ్వ ఇవ్వని నేతల పేర్లు శిలాఫలకంపై పెట్టడం హాస్యస్పదంగా ఉందన్నారు.
గద్వాల నియోజకవర్గ అభివృద్ధి ముందుకు సాగుతున్న నాయకురాలు ఎంపీ డీకె అరుణను అగౌరవపరిచేలా అధికార పార్టీ నాయకులు వ్యవహరించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీ దొడ్డి మండలాధ్యక్షుడు శ్రీపాదరెడ్డి, ఓబీసీ ప్రెసిడెంట్ ముంగిలి వీరేష్, ఉప సర్పంచ్ ఎల్ చిన్న భీమ్ రెడ్డి, నాయకులు, ఎర్ర భీమ్ రెడ్డి, అనిమిరెడ్డి, నాగిరెడ్డి, హంపిరెడ్డి, వాగుల ప్రతాప్ రెడ్డి, తిమ్మారెడ్డి, అనిమిరెడ్డి, ఎల్ మురళి, కే సుధాకర్ తిరుమలరెడ్డి, రాజు, రంగస్వామి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.