ముద్ర కాప్రా
కాప్రా, నాచారం, ఉప్పల్, మల్కాజిగిరి ,నేరేడ్మెట్ ప్రాంతాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆనంద్ బాగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ,గౌతమ్ నగర్, మల్కాజిగిరి ప్రాంతాలలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు, నాచారం, మల్లాపూర్ డివిజన్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి నివాళులర్పించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగంతో ప్రాణం పోసిన మహానీయుడు డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు.

మల్కాజ్గిరి సిపి కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మిన్ డీసీపీ ఇందిరా.. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.