- రెండు నెలల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ చేపించుకొని నేడు అచ్చంపేట కు రాక
అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ రెండు నెలల క్రితం గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్స చేసుకోవడం వలన నియోజకవర్గ ప్రజలకు కొంత సోమవారం రోజు నియోజకవర్గానికి వస్తున్నాడు అన్న వార్త తెచ్చుకొని. హజీపూర్ చౌరస్తాలో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు .అనంతరం వంశీకృష్ణ దంపతులుశ్రీశైలం ఉత్తర ద్వారంగా వెలిసిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో ప్రత్యేక పూజలు అభిషేకం కుంకుమార్చన పూజలు నిర్వహించారు.శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆశీస్సులు దేవుడు దయ అచ్చంపేట నియోజకవర్గ ప్రజల దీవెనలతో అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకొని తమ నియోజకవర్గానికి రావడం జరిగిందనీ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటూ అభివృద్ధి కి కృషి చేస్తూ నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాను అని వంశీకృష్ణ అన్నారు.నియోజకవర్గ ప్రజలు నన్ను అత్యధికంగా భారీ మెజార్టీతోగెలిపించారు కాబట్టి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి తుది శ్వాస వరకు అచ్చంపేట అభివృద్ధి కి కృషి చేస్తానన్నారు.అనంతరం ఉమామహేశ్వర క్షేత్రంలో ఆన్లైన్ పూజ కార్యక్రమాలు విధానాన్ని ప్రారంభించారు. అనంతరం అచ్చంపేట పట్టణంలో గల క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.
