Take a fresh look at your lifestyle.

కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయాలనేది ముఖ్యమంత్రి లక్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల జిల్లాలో మహిళా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మంత్రి

ముద్ర, ఎండపల్లి:

మహిళలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంపై తొలి సంతకం చేసి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాం పల్లి గ్రామంలో మణిదీప, వినాయక గ్రామ పరస్పర సహాయక పొదుపు మరియు పరపతి సహకార సంఘం నూతన భవనాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరుల చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగుతున్నారని అన్నారు.

ఇందులో భాగంగా మహిళా సంఘాలకి ఆర్టీసీ బస్సులు నడిపించుకునే అవకాశం కల్పించడంతోపాటు పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి వివరించారు.

ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు సంఘటితంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. రాజారాం పల్లి గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక అభివృద్ధి చెందడానికి సహకరిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. గ్రామంలో మటన్ ప్రాసెసింగ్ యూనిట్ తో పాటు మరిన్ని పథకాలను తీసుకురావడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

గ్రామంలోని మహిళా సంఘాలకు సభ్యులకు స్వయం ఉపాధి కోసం అవకాశాలు కల్పించాలని గ్రామ సర్పంచి సంగ రమేష్ మంత్రి గారిని కోరారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీమతి లత, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపిక తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.