Take a fresh look at your lifestyle.

కాళేశ్వరంలో సీఎం కార్యక్రమాలను పర్యవేక్షించిన కమిషనర్

 

మహాదేవపూర్, ముద్ర:

ఈనెల 20వ తేదీన ఆలయ పున ప్రతిష్ట పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నందున శిలాఫలకం, భూమి పూజ పనులకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ ఈఓ ను కమిషనర్ హనుమంతరావు ఆదేశించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గురువారం కాళేశ్వరం త్రివేణి విశ్రాంతి భవనంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి గర్భాలయం, శుభానంద దేవి అమ్మవారి ఆలయాల పునరుద్ధరణ, పున ప్రతిష్ట ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ, ఈఓ మహేష్, దేవాలయ చైర్మన్ మోహన్ శర్మ, సర్పంచ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ హనుమంతరావు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శుభానంద దేవిని,సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి చేపట్టనున్న పనులను ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.