ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి :
మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చూడాలని మున్సిపల్ కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి అన్నారు.
గురువారం జరిగిన ఆందోల్ జోగిపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశములో 12వ వార్డు కౌన్సిలర్ కోరబోయిన సరస్వతి మాట్లాడుతూ వేసవికాలం దృష్టిలో పెట్టుకొని వార్డులో మంచినీటి సమస్య తలెత్తకుండా మున్సిపల్ తరుపున అవసరమైన బోర్లు వేసి నీటిఎద్దడి రాకుండా పరిష్కారము చేయాలి అన్నారు.
అలాగే మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు కబ్జాకోరుల వల్ల అన్యాక్రాంతం కాకుండా కాపాడు కోవాలన్నారు.ప్రభుత్వ భూములను గుర్తించి వాటి రక్షణకోసం చుట్టు పెన్సింగ్ వేసి కాపాడే బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకోనీ కాపాడాలి అన్నారు.అలాగే వార్డుకు వెళ్ళే ప్రధానమార్గమైన క్లాక్ టవర్ నుండి 12వ వార్డు వరకు అధ్వాన్నంగా ఉన్న రహదారి పైన సిసి రోడ్డు వేస్తే అక్కడ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనీ వెల్లడించారు. సమస్యలను లిఖితపూర్వకంగా వ్రాసి చైర్మన్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్ళారు.దీనికి చైర్మెన్ స్పందించి తప్పకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోల్ జోగుపేట మున్సిపల్ పరిధిలో కజ్జాలు జరుగుతున్నాయని సాక్షాత్తు ఓమహిళా కౌన్సిలర్ చెప్పడం కబ్జాలకు జోగిపేట పట్టణం అని చెప్పవచ్చన్నారు. విచ్చలవిడిగా ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకొని బౌండరీలు వేసుకున్నారనీ,వీటిపై ప్రస్తుతం పాలకవర్గం రెవెన్యూ యంత్రంగా కొరడా జూలిపిస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని, హైడ్రా కూడా కబ్జాలపై దృష్టి సారించాలని అందొల్ ప్రజలు కోరుతున్నారు.