Take a fresh look at your lifestyle.

పక్కాగా ఇండ్ల గణన బ్లాక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
ఇండ్ల గణన బ్లాక్ పక్కాగా తయారు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
బుధవారం కలెక్టరేట్లో జనగణన అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో 9 మంది అధికారులు టీంగా ఏర్పడి క్లస్టర్ లో జరుగుతున్న గణనలో పలు సందేహాలు నివృత్తి చేస్తారని తెలిపారు. జనాభా, గ్రామ, మండల, పట్టణ సరిహద్దులపై పలు సూచనలు చేస్తారని తెలిపారు.
టీం సభ్యులు, జనాభా గణాంక అధికారులు సమన్వయంతో ఇండ్ల గణన బ్లాక్ లిస్ట్ను పక్కగా తయారు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈడియం సందీప్, తహసిల్దారులు, గణాంక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.