ముద్ర ప్రతినిధి, భూపాలపల్లి: ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని ఎస్‌ఐ దివ్య కోరారు.శుక్రవారం గోరి కొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ చౌరస్తాలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వానమహోత్సవంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.అదేవిదంగా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పాలన్నారు. ఎవరైనా కొత్త వారు కనిపించిన సమాచారం ఇవ్వాలన్నారు. నూతనంగా ఏర్పడిన గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో కి వచ్చిన పోలీస్ సేవలు వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది గ్రామ స్థానికులు పాల్గొన్నారు.
